Home న్యూస్ హంట్ మూవీ రివ్యూ…రేటింగ్!

హంట్ మూవీ రివ్యూ…రేటింగ్!

0

డిఫెరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ని ఎంచుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తున్న సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ హంట్ ది ఫిల్మ్…. మరోసారి డిఫెరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ను ఎంచుకున్న సుధీర్ బాబు, కంప్లీట్ గా సీరియస్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు…. ట్రైలర్ చూసిన తర్వాత ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనిపించిన హంట్ మూవీ ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… ACP ని ఎవరో ప్రొఫెషనల్ కిల్లర్ స్నైపర్ షాట్ తో చంపేస్తాడు… ఆ కేసుని సాల్వ్ చేసే క్రమంలో హీరో అనుకోకుండా జరిగిన ఓ ఇంసిడెంట్ లో…

గతం మర్చిపోతాడు…. గతం మర్చిపోయిన హీరో ఎలా ఆ కేసుని సాల్వ్ చేస్తాడు… ఇంతకీ ఆ హత్య చేయడానికి కారణం ఏంటి, హీరో ఈ చిక్కుముడులు అన్నీ ఎలా విప్పాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. సీరియస్ నోట్ తో సాగే ఈ సినిమా ఓపెన్ అవ్వడం ఆసక్తి కరంగా ఓపెన్ అవ్వగా తర్వాత… కొంచం స్లో డౌన్ అవుతుంది, కథ ఫ్లాట్ గా సాగుతున్న తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుండి మళ్ళీ జోరు అందుకోగా సెకెండ్ ఆఫ్ పై ఆసక్తి పెరుగుతుంది.

ఇక సెకెండ్ ఆఫ్ లో అసలు కథ మొదలు అవ్వగా అక్కడక్కడా స్లో అయినా ప్రీ క్లైమాక్స్ నుండి జోరు అందుకుని క్లైమాక్స్ చాలా బాగా ముగుస్తుంది… పెర్ఫార్మెన్స్ పరంగా సుధీర్ బాబు బాగానే నటించి మెప్పించగా యాక్షన్ సీన్స్ లో మరోసారి అదరగొట్టేశాడు… శ్రీకాంత్, భరత్ లు తమ రోల్స్ లో బాగానే నటించారు. సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి ఎక్స్ లెంట్ గా ఉంది… 

ఎడిటింగ్ ఫస్టాఫ్ లో కొంచం స్లో గా ఉన్నా సెకెండ్ ఆఫ్ లో బాగానే ఇంప్రెస్ చేస్తుంది… ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా డైరెక్షన్ విషయానికి వస్తే మంచి ఆసక్తిని కలిగించే పాయింట్ తో సినిమాను మొదలు పెట్టినా డైరెక్టర్ ఫస్టాఫ్ లో కొంచం గాడితప్పినట్లు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో మాత్రం బాగానే ఇంప్రెస్ చేశాడు… కానీ ఈ జానర్ మూవీస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కొంచం కష్టమే…

ఇలాంటి సీరియస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి, రొటీన్ మూవీస్ చూసి డిఫెరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చూడాలి అనుకున్న వాళ్లకి కొంచం ఓపికతో చూస్తె సినిమా సెకెండ్ ఆఫ్ లో పర్వాలేదు అనిపించేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మెప్పించవచ్చు…. సినిమా అక్కడక్కడా గాడితప్పినట్లు అనిపించినా ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ముగుస్తుంది… సినిమా మొత్తం మీద మా రేటింగ్ 2.75 స్టార్స్…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here