2 బాక్ టు బాక్ ఫ్లాఫ్ మూవీస్ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. పండగ సెలవుల్లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోయగా తర్వాత లాంగ్ రన్ లో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ ప్రయాణం సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలను పూర్తీ చేసుకున్న తర్వాత….
తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా కొన్ని ఏరియాలలో GST రిటర్న్స్ కూడా యాడ్ అవ్వడంతో టోటల్ గా 103.89 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా షేర్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఫైనల్ రన్ ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
👉#RRR: 272.31CR
👉#Baahubali2: 204Cr
👉#AVPL: 130.17Cr
👉#SarileruNeekevvaru: 117.50Cr
👉#Baahubali: 114Cr
👉#SyeRaa: 106.4Cr
👉#WaltairVeerayya -103.89CR*****
👉#Rangasthalam: 95.27Cr
👉#SarkaruVaariPaata – 90.07Cr
👉#Pushpa: 85.35Cr
ఓవరాల్ గా 100 కోట్ల షేర్ మార్క్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న మూవీస్ లో 7వ ప్లేస్ ను ప్రస్తుతానికి సొంతం చేసుకున్న వాల్తేరు వీరయ్య ఫైనల్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి. మొత్తం మీద 2 100 కోట్ల షేర్ మూవీస్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని మెగాస్టార్ ఊచకోత కోశాడు.