బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది. సినిమా మూడో వీకెండ్ లో తిరిగి జోరు చూపించడం స్టార్ట్ చేయగా ఆల్ రెడీ 16వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజున…
ఆదివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ మరోసారి గ్రోత్ ని సొంతం చేసుకోవడంతో ఈ రోజు మరోసారి ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సాధించడం ఖాయమని చెప్పాలి. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల రేంజ్ నుండి 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా మించే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.1 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని…
దక్కించుకునే అవకాశం ఉంది. రిలీజ్ అయిన 17వ రోజు ఇలాంటి కలెక్షన్స్ ని అందుకోవడం మామూలు విషయం కాదు. ఒకవేళ సినిమా అన్ని చోట్లా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ 17 డేస్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.