బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక నార్మల్ యాక్షన్ మూవీ ఎపిక్ రికార్డులను క్రియేట్ చేసిన సినిమా కలెక్షన్స్ ని అందుకోవడం అన్నది మాములు విషయం కాదు, అది కూడా వరుస ఫ్లాఫ్స్ లో ఉండి కొత్త సినిమా కూడా రిలీజ్ అయ్యి చాలా ఏళ్ళు అవుతున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి ఊహకందని రికార్డ్ ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్..
షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలోనే అనేక సినిమాల రికార్డులను బ్రేక్ చేసి ఊచకోత కోయగా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు…
హోల్డ్ చేస్తున్న తీరు చూసి బాలీవుడ్ లో 6 ఏళ్ల క్రితం బాహుబలి2 నెలకొల్పిన ఊహకందని కలెక్షన్స్ రికార్డ్ అయిన 511 కోట్ల నెట్ కలెక్షన్స్ రికార్డ్ ను ఇప్పుడు పఠాన్ మూవీ బ్రేక్ చేయడానికి ఎక్స్ లెంట్ గా ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు…
ప్రస్తుతానికి 8 రోజుల కలెక్షన్స్ తో అటూ 342 కోట్ల మార్క్ ని దాటిన ఈ సినిమా ఈ వీకెండ్ అయ్యే లోపు అటూ ఇటూగా 455-460 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ కనిపిస్తుందని ప్రిడిక్ట్ చేస్తూ ఉండగా వచ్చే వారం వీకెండ్ సమయానికి బాహుబలి2 ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కనుక జరిగితే చరిత్రలో నిలిచిపోయే కంబ్యాక్ ని అలాగే ఇండస్ట్రీ హిట్ ని షారుఖ్ తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పొచ్చు.