వచ్చిన కలెక్షన్స్ కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ పోస్టర్స్ ని రిలీజ్ చేయడం అన్నది అన్ని ఇండస్ట్రీలలో కూడా కామన్ గా జరుగుతూ ఉండేదే. అవి పబ్లిసిటీ కోసం చేసే పనులు అని తక్కువ మందికే తెలుసు…హీరోని ఫ్యాన్స్ ని సాటిస్ ఫై చేయడనికి, కలెక్షన్స్ రికార్డుల కోసం ఇలా అప్పుడప్పుడు కొన్ని సినిమాల కలెక్షన్స్ ని ఎక్కువగా వచ్చినట్లు చూపిస్తూ ఉంటారు… ఇలాంటివి టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కూడా జరుగుతూనే ఉన్నాయి.
లేటెస్ట్ గా కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరున్న దర్శన్ నటించిన లేటెస్ట్ మూవీ క్రాంతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తీ చేసుకోగా ట్రేడ్ లెక్కల్లో వచ్చిన కలెక్షన్స్ కి అలాగే మూవీ టీం రిలీజ్ చేసిన కలెక్షన్స్ కి…
ఏమాత్రం సింక్ లేదనే చెప్పాలి. మొదటి 4 రోజుల వీకెండ్ లో సినిమా ట్రేడ్ లెక్కల్లో 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే టీం ఏకంగా 109 కోట్లు వసూల్ చేసిందని పోస్టర్స్ రిలీజ్ చేసి కేక్ కట్టింగ్ లు కూడా చేసుకున్నారు…. కానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ రిపోర్ట్స్ కి…ఈ పోస్టర్స్ కలెక్షన్స్ కి గ్యాప్ భూమికి ఆకాశానికి ఉన్నంత ఉంది. ఇక మొదటి వారం మొత్తం మీద సినిమా సాధించిన వరల్డ్ వైడ్ గ్రాస్ 35 కోట్ల రేంజ్ లోనే ఉండే అవకాశం ఉండగా….
ఈ కలెక్షన్స్ కలిపినా టీం రిలీజ్ చేసిన గ్రాస్ పోస్టర్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళదు. ఇది వరకు ఈ హీరో చేసిన రాబర్ట్ మూవీ తెలుగులో కూడా డబ్ అవ్వగా ఇక్కడ 10 లక్షల లోపు కలెక్షన్స్ కి రోజు 2 కోట్లకు పైగా గ్రాస్ పోస్టర్స్ ని రిలీజ్ చేసి తీవ్రంగా ట్రోల్ అవ్వగా ఇప్పుడు మరోసారి ఈ హీరో సినిమా ఫేక్ కలెక్షన్స్ కారణంగా ట్రోల్ అవ్వాల్సి వస్తుంది.