నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమా తో గోపీచంద్ మలినేని బాక్ టు బాక్ హిట్స్ ను సొంతం చేసుకున్నాడు. బాలయ్య కూడా బాక్ టు బాక్ హిట్స్ ను కెరీర్ బెస్ట్ వసూళ్ళని సొంతం చేసుకోవడం విశేషం. కానీ బాలయ్య వీర సింహా రెడ్డి…
ప్లేస్ లో మరో బ్లాక్ బస్టర్ మూవీని చేయాల్సింది, కానీ డేట్స్ అడ్జస్ట్ చేయక పోవడం వలన ఆ సినిమా మిస్ అయింది. ఆ సినిమా మరేదో కాదు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లోనే మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్ సినిమా…
రెండేళ్ళ క్రితం సంక్రాంతికి రిలీజ్ అయ్యి రవితేజ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా నిలిచిన ఈ సినిమా కథని ముందుగా గోపీచంద్ మలినేని బాలయ్యకే చెప్పారని, సి కళ్యాణ్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించాలి అనుకున్నారని నిర్మాత సి కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు…
కానీ బాలయ్య డేట్స్ అడ్జస్ట్ కాక పోవడంతో నిర్మించడం కుదరలేదని, అదే కథ రవితేజకి వెళ్ళడం బ్యానర్ కూడా మారిపోవడంతో సినిమా చేతులు మారగా గోపీచంద్ కూడా చెప్పిన కొత్త కథ అయిన వీర సింహా రెడ్డి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించారు… బాలయ్య క్రాక్ బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నాడు… రవితేజ క్రాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు.