ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే కోలివుడ్ ఆడియన్స్ టేస్ట్ కొంచం డిఫెరెంట్ గా ఉంటుంది…. ఏ సినిమా పడితే ఆ సినిమాను వాళ్ళు ఆదరించరు… అప్పుడప్పుడు బాహుబలి, కేజిఎఫ్ మరియు పుష్ప లాంటి సినిమాలను మినహాయిస్తే వేరే ఏ సినిమా కూడా అక్కడ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేదు. కాంతార లాంటి సినిమా కేరళ కలెక్షన్స్ కన్నా తమిళ్ కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి. ఎక్కువ శాతం తమిళ్ ఫ్లేవర్ ఉన్న….
మూవీస్ నే ఎక్కువగా ప్రిఫర్ చేసే కోలివుడ్ ఆడియన్స్ ఇప్పుడు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉన్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్/వాతి ని అనుకున్న రేంజ్ లో అయితే ఆదరించడం లేదు. తెలుగు తమిళ్ బైలింగువల్ గా తెరకెక్కిన ఈ సినిమా కి మొదటి 2 రోజుల కలెక్షన్స్…
తమిళనాడులో వచ్చిన వసూళ్ళకి ఆల్ మోస్ట్ ఈక్వల్ గా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వచ్చాయి. మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పోటి లేక పోయినా తక్కువగా రావడం అందరికీ మైండ్ బ్లాంక్ చేస్తుంది….అదే టైంలో ధనుష్ నటించిన తిరు సినిమా 3 రోజుల్లో 29 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే…
ఆ సినిమా కన్నా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వాతి సినిమా 16 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది. అదే టైంలో తెలుగు కలెక్షన్స్ బెటర్ గా ఉండటంతో మరోసారి తెలుగు ఆడియన్స్ ఏ సినిమా అయినా నచ్చితంగా ఏ రేంజ్ లో ఆదరిస్తారో అన్నది మరోసారి రుజువు అయింది. PS1 రిలీజ్ టైంలో తెలుగు ఆడియన్స్ ను ట్రోల్ చేసిన తమిళ్ ఆడియన్స్ తర్వాత ప్రతీ సారి టాలీవుడ్ ఆడియన్స్ కి ఇలా దొరికిపోతూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు.