బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150 తప్పితే మిగిలిన సినిమాలు నష్టలానే మిగిలించాయి. ముఖ్యంగా 2022 లో వచ్చిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన తర్వాత ఈ ఇయర్ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మెగాస్టార్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ….
వాల్తేరు వీరయ్య సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఓపెనింగ్ డే నుండే రచ్చ చేయడం స్టార్ట్ చేయగా తర్వాత కూడా అల్టిమేట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఇప్పుడు 6వ వారంలో ఉన్నప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో షేర్స్ ని ఇంకా సొంతం చేసుకుంటూ…
పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. కాగా సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ 40వ రోజులో ఉండగా మొత్తం మీద ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా టోటల్ ప్రాఫిట్ లెక్క 88 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 49 కోట్ల మార్క్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది….
మొత్తం మీద సినిమా 40 రోజుల్లో ఆల్ మోస్ట్ 137 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 48 కోట్ల ప్రాఫిట్ ను బిజినెస్ మీద 49 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో నష్టాల నుండి ఇప్పుడు హ్యుమంగస్ ప్రాఫిట్స్ తో మెగాస్టార్ కెరీర్ లో అత్యధిక ప్రాఫిట్ ను అందుకున్న మూవీగా రికార్డులను చెల్లాచెదురు చేయడం విశేషం అని చెప్పాలి.