కోలివుడ్ టాప్ హీరో విజయ్ కి తెలుగు లో కూడా రీసెంట్ టైం లో ఏ హీరోకి లేనంత గ్రోత్ సొంతం అయ్యింది, తన లేటెస్ట్ మూవీ వారసుడు భారీ పోటిలో కూడా తన కెరీర్ లో తెలుగు లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, కానీ అలాంటి సినిమాను… అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్…
తెలుగు లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ సీజన్ లో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఇప్పుడు కేవలం 10 రోజుల టైంకే విజయ్ తెలుగు హైయెస్ట్ ని క్రాస్ చేసి ధనుష్ కి అద్బుతమైన మార్కెట్ ని ఒక్క సినిమాకే తెలుగు లో సొంతం చేసిందని చెప్పాలి.
విజయ్ వారసుడు సినిమా టోటల్ రన్ లో 15.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇప్పుడు 10 రోజుల్లోనే ధనుష్ నటించిన సార్ మూవీ తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 15.16 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు విజయ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు లో క్రాస్ చేసిన ధనుష్…
తెలుగు లో రిలీజ్ అయిన కోలివుడ్ మూవీస్ పరంగా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న హీరోలలో ఒకరిగా నిలవడానికి సిద్ధం అవుతున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సార్ మూవీ ఇంకా కలెక్షన్స్ ని పెంచుకుని దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది.