కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ లు తీసుకునే హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయకపొతే మట్టుకు ఆ సినిమాలను కొన్న వాళ్ళకి ఊహించని రేంజ్ లో నష్టాలు రావడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇలాంటిదే జరుగుతుంది ఈ హీరో విషయంలో…. ప్రతీ సినిమాకి అవలీలగా 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటూ ఒక ఏడాది కి ఈజీగా 4 సినిమాలు చేసే ఈ హీరోనే అక్షయ్ కుమార్…
బాలీవుడ్ లో ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ పీక్ స్టేజ్ లో హిట్స్ ను సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకి 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటూ ఉండగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ మూవీస్ దారుణంగా విఫలం అవుతూ ఉన్నాయి.
తన లేటెస్ట్ మూవీ సేల్ఫీ కి 105 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకున్న ఈ హీరో కలెక్షన్స్ పరంగా మాత్రం కనీస ఓపెనింగ్స్ ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా నిరాశ పరుస్తున్నాడు. సినిమా వీకెండ్ లో అతి కష్టం మీద 10 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే…
4వ రోజు వర్కింగ్ డే లో కేవలం 1.5 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇంత రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరో సినిమా ఇలాంటి దారుణమైన కలెక్షన్స్ ని సాధించడం చూసి అందరూ శాకవుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి బ్యాడ్ ఫేస్ నుండి హీరో ఎలా బయటికి వస్తాడో చూడాలి.