రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ కి హాలీవుడ్ క్రిటిక్ అసోషియేషన్ వాళ్ళు ఏకంగా 4 అవార్డులను ఇవ్వడంతో ఇండియా లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆర్ ఆర్ ఆర్ ఓ రేంజ్ లో వార్తల్లో నిలిచింది… కానీ అదే టైంలో సినిమాలో హీరోకి క్రెడిట్ ఎక్కువ సొంతం చేసుకోవడానికి ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొదటి నుండి కూడా నువ్వా నేనా అనుకుంటూ సోషల్ మీడియా లో…
ట్రోల్స్ చేసుకుంటూనే ఉన్నారు…. ఇక లేటెస్ట్ ఎన్టీఆర్ తారకరత్న మరణం ఉండటం, దాని కన్నా ముందు మంత్ ఎండ్ లో ఎన్టీఆర్30 స్టార్ట్ అవ్వాల్సి ఉండటంతో ఇక్కడే ఆగిపోగా తారకరత్న మరణం వలన అన్నీ కాన్సిల్ చేసుకున్నాడు… ఇక రామ్ చరణ్ HCA అవార్డుల వేడుకలో పాల్గొనగా…
టోటల్ టీం మొత్తానికి అవార్డులు ఇవ్వడం, ఎన్టీఆర్ రాకపోవడంతో రామ్ చరణ్ కి అవార్డ్ ఇవ్వడంతో ఇక్కడ మెగా ఫ్యాన్స్ తో పాటు మీడియా రామ్ చరణ్ కే అవార్డు వచ్చింది అంటూ ఓవర్ గానే సంతోష పడగా RRR టీం అలాగే HCA అవార్డు వాళ్ళు ఎన్టీఆర్ అవార్డ్ త్వరలో వచ్చాక ఇస్తామని చెప్పారు…
దానికి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉండటంతో ఏకంగా అవార్డు వాళ్ళు ఒక స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు, ఎన్టీఆర్ కి కూడా అవార్డ్ ఇవ్వాల్సింది కానీ ఎన్టీఆర్ తన సినిమా పనుల వలన రాలేదని, వచ్చాక ఇస్తామని స్టేట్ మెంట్ ఇచ్చారు…ఏకంగా అవార్డు వాళ్ళే చెప్పడంతో ఇక అందరూ కూడా సైలెంట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాలి. వీళ్ళ ఫ్యాన్ వార్స్ వలన టీం కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.