లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊహకందని ఊచకోత కోసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 1 ఇయర్ కావోస్తూ ఉన్నా కానీ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూ ఉండటం విశేషం, ఒక పక్క ఆస్కార్ ప్రమోషన్స్ లో టీం బిజీగా ఉండగా మరో పక్క జపాన్ లో సినిమా ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూనే ఉంది. ఇక అమెరికాలో రీ రిలీజ్ అయ్యి అక్కడ కూడా సినిమా..
మంచి వసూళ్ళనే రాబడుతూ ఉండగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమాను ఆస్కార్ టైంలో జనాలు థియేటర్స్ లో చూడాలి అనుకుంటారేమో అని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజున మొత్తం మీద నైజాంలో 80 థియేటర్స్, ఆంధ్రలో 100 థియేటర్స్ లో సీడెడ్ లో 30 వరకు థియేటర్స్ లో…
ఆర్ ఆర్ ఆర్ మూవీ రీ రిలీజ్ అవ్వగా సినిమా ఆల్ మోస్ట్ 210 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇక సినిమాకి ఆంధ్రలో అడ్వాన్స్ బుకింగ్స్ కింద 12 లక్షల దాకా బుకింగ్స్ జరగగా నైజాం ఏరియాలో 7 లక్షల దాకా బుకింగ్స్ జరిగాయి… మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో…
20 లక్షల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ జరిగాయి. రీ రిలీజ్ మూవీ కి ఇవి ఎక్స్ లెంట్ బుకింగ్స్ అని చెప్పాలి. మొత్తం మీద లాస్ట్ ఇయర్ లా అద్బుతాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సృష్టించే అవకాశం తక్కువే అయినా ఆస్కార్ కనుక సొంతం చేసుకుంటే ఆ టైంలో థియేటర్స్ లో సినిమా రచ్చ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు.