యంగ్ హీరో విశ్వక్ సేన్ తానె హీరోగా డైరెక్టర్ గా మారి తీసిన సినిమా దాస్ కా ధమ్కీ, సినిమాను తనదైన స్టైల్ లో బాగా ప్రమోట్ చేసుకున్న విశ్వక్ సేన్ ఉన్నంతలో డీసెంట్ బజ్ నే క్రియేట్ చేసి సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశాడు. మరి ఆడియన్స్ ముందుకు ఉగాది కానుకగా రిలీజ్ అయిన దాస్ కా ధమ్కీ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… ఓ స్టార్ హోటల్ లో వెయిటర్ గా పని చేసే హీరో…రిచ్ గా బ్రతకాలి అనుకుంటూ ఉండగా హీరోయిన్ ని చూసి ఇష్టపడటం…
తన కోసం డబ్బున్న వ్యక్తీగా నటిస్తూ ఉండగా మరో పక్క సెకెండ్ రోల్ కాన్సర్ కి ఓ మందు కనుక్కోవడంతో 10 వేల కోట్ల డీల్ సెట్ అవుతుంది, కానీ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి, అవేంటి, వాటి తర్వాత హీరో ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…కథ పాయింట్ చాలా రొటీన్ గానే ఉండబోతుందని ట్రైలర్స్ లో ఆల్ రెడీ క్లియర్ అయిపొయింది… కానీ ఫస్టాఫ్ కథ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నారు…ప్రీ ఇంటర్వెల్ వరకు కథ చాలా రొటీన్ గా బోర్ గా సాగుతూ ఉండగా ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి జోరు అందుకుని సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచుతుంది…
ఇక సెకెండ్ ఆఫ్ కథలో చాలా ట్విస్ట్ లు ఉండటం అలాగే స్క్రీన్ ప్లే కన్ఫ్యూజర్ ని క్రియేట్ చేసేలా ఉండటం లాంటివి ఇబ్బంది పెట్టినా…ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్ మెప్పిస్తుంది, క్లైమాక్స్ తో పాటు పోస్ట్ క్రెడిట్ సీన్ తో మెప్పించాడు విశ్వక్ సేన్, తన రోల్ సినిమా ఆద్యంతం డిఫెరెంట్ షేడ్స్ తో కూడుకుని ఉంటుంది, ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో మెప్పిస్తుంది కానీ కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఇబ్బంది పెడుతుంది… కానీ ఇది పక్కగా విశ్వక్ వన్ మ్యాన్ షో. హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన రోల్స్ అన్నీ జస్ట్ ఓకే అనిపిస్తాయి. సంగీతం బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మెప్పిస్తుంది… ఎడిటింగ్ ఫస్టాఫ్ లో మరింత రేసీగా ఉంటే బాగుండేది…
ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా మొత్తం మీద సినిమా రొటీన్ ఫార్మాట్ లో సాగే కమర్షియల్ మూవీనే, ఆల్ మోస్ట్ ధమాకా టైప్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న దాస్ కా ధమ్కీ లో కన్ఫ్యూజిక్ స్క్రీన్ ప్లే అండ్ టేక్ ఆఫ్ కి చాలా టైం పట్టడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్ అయినా సెకెండ్ ఆఫ్ ట్విస్ట్ లను సరిగ్గా గెస్ చేసి ఎంజాయ్ చేయగలిగితే కొంచం ఓపికతో…చూడగలిగితే సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు…..
విశ్వక్ సేన్ నటన, కొన్ని మాస్ మూమెంట్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, 3 గుడ్ సాంగ్స్ లాంటివి ప్లస్ పాయింట్స్ కాగా కన్ఫ్యూజిక్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్టొరీ పాయింట్, కాన్సర్ క్యూర్ చుట్టూ అల్లుకున్న కథ లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి. మొత్తం మీద దాస్ కా ధమ్కీ చాలా ఓపికతో లాజిక్ లు ఏవి పట్టించుకోకుండా చూడగలిగితే ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….