బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా కన్నా ముందు చేసిన ధమాకా సినిమాతో తన కెరీర్ లో ది బెస్ట్ హిట్ ని హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రవితేజ ఓ రేంజ్ లో రచ్చ చేశాడు. ఇక ఇప్పుడు రావణాసుర సినిమా బజ్ అయితే…
మరీ అంత గట్టిగా ఏమి లేక పోయినా వన్స్ రిలీజ్ అయ్యి టాక్ బాగుంటే కచ్చితంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక ధమాకాతో 45 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టినా రావణాసుర ఒక రకమైన ఎక్స్ పెరి మెంటల్ మూవీ నే అవ్వడంతో…
బిజినెస్ పరంగా మరీ ఎక్కువ బిజినెస్ ఏమి చేయలేదు అనిపిస్తుంది. ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కి నైజాం ఏరియాలో మొత్తం మీద ఇప్పుడు 7 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇది వరకు రవితేజ నటించిన ధమాకా మూవీ నైజాం ఏరియాలో…
5.5 కోట్ల బిజినెస్ ను అందుకుని టోటల్ రన్ లో 18.2 కోట్లకు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు రావణాసుర సినిమా మొత్తం మీద 7 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా టాక్ బాగుంటే వీకెండ్ కే ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.