బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రీసెంట్ మూవీ మీటర్ కిరణ్ అబ్బవరంకి మాస్ లో మంచి కలెక్షన్స్ తో మాస్ ఇమేజ్ ని తీసుకు వస్తుంది అనుకున్నా కానీ అలాంటిది ఏమి జరగలేదు సరికదా ఉన్న మార్కెట్ పై కూడా సాలిడ్ గా ఎఫెక్ట్ చూపించింది ఈ సినిమా రిజల్ట్ ఇప్పుడు. ఒక్క రోజు కూడా షేర్స్ ని సొంతం చేసుకోలేక పోయిన…
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ జీరో షేర్ రేంజ్ కలెక్షన్స్ తో అట్టర్ డిసాస్టర్ గా నిలిచింది ఇప్పుడు. దాంతో కిరణ్ అప్ కమింగ్ మూవీస్ పై కూడా ఈ ఇంపాక్ట్ పడుతూ ఉండగా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రావాల్సిన రూల్స్ రంజన్ సినిమా కొంత టైం వరకు పోస్ట్ పోన్ అవ్వగా…
అలాగే కిరణ్ అబ్బవరంతో చేయాలి అనుకుంటున్నా నిర్మాతలు కూడా కొంచం వెనకడుగు వేస్తున్నారని లేటెస్ట్ గా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది ఇప్పుడు. తన సినిమాలకు కథలను తానె సిద్ధం చేసుకుని డైరక్టర్ ను సెలెక్ట్ చేసుకుని ఒక టీం తో కిరణ్ సినిమాలను పూర్తీ చేసి….
నిర్మాతలకు ఇస్తాడు… కానీ ఇప్పుడు ఒక్క డిసాస్టర్ మూవీతో లెక్కలన్నీ మారిపోగా నిర్మాతల కండీషన్ లు కూడా మరింతగా పెరిగి పోయాయి అని అంటున్నారు. ఒక్క ఫ్లాఫ్ ఎఫెక్ట్ కెరీర్ అప్ కమింగ్ మూవీస్ పై కూడా గట్టి ఇంపాక్ట్ ని చూపించే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితి నుండి కిరణ్ అబ్బవరం ఎలాంటి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.