బాక్స్ ఆఫీస్ దగ్గర 65 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సమంత నటించిన శాకుంతలం సినిమా 18 కోట్ల వాల్యూ బిజినెస్ తో 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా తొలి ఆటకే అట్టర్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా మొత్తం మీద 5 రోజుల్లో 4.04 కోట్ల షేర్ ని అందుకోగా…
తర్వాత 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 16 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 2.50 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంటే వరల్డ్ వైడ్ గా 4.20 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది…
టోటల్ గ్రాస్ లెక్క 8.75 కోట్ల దాకా సొంతం చేసుకున్న సినిమా అట్టర్ డిసాస్టర్ గా నిలిచింది. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 14.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
కానీ కొత్త రిలీజ్ ల కారణంగా థియేటర్స్ ని 70% వరకు కోల్పోయిన సినిమా ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి. టోటల్ రన్ లో 10 కోట్ల గ్రాస్ ను కూడా అందుకోలేక పోయిన ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్ దృశ్యా వన్ ఆఫ్ ది ఎపిక్ ఆల్ టైం డిసాస్టర్ అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర.