బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా సూపర్ సక్సెస్ తర్వాత రెండో పార్ట్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ముందు చాలా స్లో గా ఉన్నా కూడా రిలీజ్ రోజుకి వచ్చే సరికి సినిమా కి టాక్ బాగుండటంతో షో షో కి కలెక్షన్స్ ఇంప్రూవ్ మెంట్ జరుగుతూ వెళ్ళింది సినిమా. సినిమా హైదరాబాదు లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది.
మిగిలిన చోట్ల కూడా షో షో పరంగా ఇంప్రూవ్ మెంట్ కనిపించగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే విధంగా ఉంటే సినిమా మొదటి రోజు ఓవరాల్ గా అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 2 కోట్ల నుండి 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే సినిమా ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక తమిళనాడులో సినిమా 20 కోట్లకి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 40 కోట్ల నుండి 45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 50 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవచ్చు. మొత్తం మీద రిలీజ్ కి ముందు రోజుతో పోల్చితే ఇలాంటి గ్రోత్ ఊహించలేదు. ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.