మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా మొదటి రోజు కన్నా ముందు ఉన్న బుకింగ్స్ తో పోల్చితే ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ నే ఫస్ట్ డే సాధించింది అని చెప్పాలి. ఇక రెండో రోజుకి వచ్చే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా…
సినిమా రెండో రోజు హైదరాబాదులో మరోసారి మంచి ట్రెండ్ ని చూపిస్తుంది ఇప్పుడు, ఇక తమిళనాడులో కూడా ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో సినిమా జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక మొత్తం మీద రెండో రోజు సినిమా మొదటి రోజుతో పోల్చితే…
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మొదటి రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.5 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు. ఇక సినిమా తమిళనాడులో అన్ని చోట్లా అంచనాలను మించిపోతే…
20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజు ఇప్పుడు 36 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి రెండో రోజు మొదటి రోజు మాదిరిగా అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు. ఇక టోటల్ గా 2 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..