బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో 2 క్రేజీ మూవీస్ రిలీజ్ అయ్యాయి, వాటిలో ఒకటి టాలీవుడ్ బిగ్ రిలీజ్ కాగా మరోటి కోలివుడ్ పాన్ ఇండియన్ మూవీ… కానీ ఇప్పుడు ఆ 2 సినిమాలను కూడా ప్రీవియస్ వీక్ లో రిలీజ్ అయిన సాయి ధరం తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఫుల్ డామినేట్ చేస్తూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కొత్త సినిమాల మీద లీడ్ ని చూపిస్తుంది.
రెండో రోజులో అడుగు పెట్టిన ఏజెంట్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కేవలం 67 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని ఎపిక్ ఫేల్యూర్ గా నిలవడానికి సిద్ధం అవుతూ ఉండగా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో స్ట్రైట్ మూవీ ని మించి డబ్బింగ్ మూవీ అయిన…
పొన్నియన్ సెల్వన్ 2 సినిమా 1.58 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సాలిడ్ గా గ్రోత్ ని చూపించింది ఇప్పుడు. ఇక ఈ రెండు సినిమాలను కూడా 9వ రోజులో ఉన్న సాయి ధరం తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఏకంగా 1.84 కోట్ల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా కొత్త సినిమాలను అద్బుతమైన పాజిటివ్ టాక్ పవర్ తో విరూపాక్ష సినిమా ఫుల్ డామినేట్ చేసింది. ఇక ఇవాళ రేపు కూడా విరూపాక్ష సినిమా ఏజెంట్ అండ్ PS2 సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేయడం ఖాయమని చెప్పాలి.