పొన్నియన్ సెల్వన్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా కి మే డే హాలిడే అడ్వాంటేజ్ తో మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి హోల్డ్ నే చూపిస్తుంది ఇప్పుడు…
ఆల్ మోస్ట్ 3వ రోజుతో పోల్చితే 20% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ గా క్లాస్ సెంటర్స్ లో డీసెంట్ హోల్డ్ వలన మొత్తం మీద ఈ రోజు సినిమా 1 కోటి రేంజ్ నుండి 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా మరోసారి 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 40 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో సినిమా 4 రోజుల్లో టోటల్ గా ఇప్పుడు 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క పెరగవచ్చు. ఇక టోటల్ 4 డేస్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.