బాక్స్ ఆఫీస్ దగ్గర పొన్నియన్ సెల్వన్ 2 సినిమా 4 రోజుల్లో ఓవరాల్ గా పార్ట్ 1 తో పోల్చితే అనుకున్న రేంజ్ లో వసూళ్ళని అందుకోక పోయినా కానీ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక 5వ రోజు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా కొంచం ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకున్నా కానీ…
మొత్తం మీద 225 కోట్ల మార్క్ ని అధిగమించింది ఇప్పుడు. తెలుగు లో సినిమా 5వ రోజు మొత్తం మీద 43 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా మొత్తం మీద 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 3.23Cr
👉Ceeded: 48L
👉UA: 47L
👉East: 38L
👉West: 25L
👉Guntur: 34L
👉Krishna: 35L
👉Nellore: 20L
AP-TG Total:- 5.70CR(11.50Cr~ Gross)
మొత్తం మీద సినిమా 10.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.80 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 5వ రోజున 18.30 కోట్ల గ్రాస్ ను అందుకోగా టోటల్ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 73.85Cr
👉Telugu States- 11.50Cr
👉Karnataka- 13.45Cr
👉Kerala – 10.85Cr
👉ROI – 13.35Cr
👉Overseas – 102.50CR~(est)
Total WW collection – 225.50CR(108.80CR~ Share)
మొత్తం మీద సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 63.20 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది.