బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన 2 కొత్త సినిమాలు, లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా అన్నీ కూడా యునానిమస్ టాక్ ని అయితే సొంతం చేసుకోలేదు. కానీ అదే టైంలో రెండు వారాల క్రితం రిలీజ్ అయిన సాయి ధరం తేజ్ విరూపాక్ష సినిమా యునానిమస్ టాక్ ను సొంతం చేసుకోగా…. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా…
కొత్త సినిమాలను అన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. మే 7న టాలీవుడ్ థియేటర్స్ లో రన్ అయిన సినిమాలు అన్నింటిలోకి కూడా విరూపాక్ష సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.
3వ రోజులో ఉన్న ఉగ్రం మూవీ 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా, 3వ రోజులోనే ఉన్న రామ బాణం సినిమా 65 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక 10వ రోజులో ఉన్న పొన్నియన్ సెల్వన్2 సినిమా 17 లక్షల షేర్ తోనే సరిపెట్టుకోగా ఈ సినిమాలతో పోల్చితే…
17వ రోజులో ఉన్న విరూపాక్ష సినిమా మాత్రం 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపాయి. ఓవరాల్ గా ఈ నాలుగు సినిమాలు కలిపి మే7న బాక్స్ ఆఫీస్ దగ్గర 2.27 కోట్ల షేర్ ని 4.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేశాయి. కొత్త సినిమాలు విరూపాక్ష ముందు తలవంచక తప్పలేదు. ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తాయో చూడాలి.