ప్రభాస్ రాజమౌళిల కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమాను ఇప్పుడు ఇదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తూ తన తొలి హిందీ మూవీగా అక్కడ లాంచ్ అయ్యాడు బెల్లం కొండ శ్రీనివాస్…. వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సీన్ టు సీన్ ఛత్రపతి రీమేక్ అయినా కూడా హిందీ ఆడియన్స్ ని మెప్పించడానికి కొంచం బ్యాగ్ డ్రాప్ ను మార్చి క్రిస్ప్ రన్ టైంతో…
తెరకెక్కించగా ఓవరాల్ గా సినిమా ఒరిజినల్ ని మ్యాచ్ చేసినా లేదా అంటే అసలు ఏమాత్రం చేయలేదు అనే చెప్పాలి ఇప్పుడు. ఇక్కడ శ్రీలంక బ్యాగ్ డ్రాప్ ను మార్చి పాకిస్థాన్ బ్యాగ్ డ్రాప్ గా సెట్ చేయడం ఒక్కటి తప్పితే మిగిలిన సినిమా మొత్తం యాసిటీస్ గా…
అలాగే దింపేశారు…ఫైట్స్ మీద పెట్టిన ఫోకస్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ కనెక్షన్ మీద పెట్టక పోవడంతో సీన్ బై సీన్ వస్తూ వెళుతూ ఉన్నా కూడా పెద్దగా ఏ సీన్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. డాన్సులు ఫైట్స్ పరంగా మరోసారి దుమ్ము లేపిన బెల్లంకొండ….
పెర్ఫార్మెన్స్ పరంగా బిలో యావరేజ్ మార్కులే పడతాయి అని చెప్పాలి. చాలా వరకు ఒరిజినల్ చూసిన ఆడియన్స్ ఎంత వద్దు అనుకున్నా ఒరిజినల్ తో కంపేర్ చేస్తారు కాబట్టి ఆ విధంగా చూసుకుంటే 10 కి 5 మార్కులు మాత్రమే సొంతం చేసుకుంటుంది ఈ సినిమా…
కానీ ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి సినిమా కథ చాలా ఓల్డ్ స్టోరీలా అనిపించగా యాక్షన్ పార్ట్ వరకు వాళ్ళని సాటిస్ ఫై చేసినా మిగిలిన కథ మెప్పించడం కష్టమే అని చెప్పాలి. ఓవరాల్ గా హిందీ ఛత్రపతి ఒరిజినల్ యాసిటీస్ గా దింపేసినా యాక్షన్ సీన్స్ తప్పితే మిగిలిన ఏ అంశంలో కూడా మెప్పించలేక పోయింది…