తమిళ్ హీరోలతో తెలుగు డైరెక్టర్స్ సినిమాలు చేస్తే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కానీ అదే టైంలో తమిళ్ డైరెక్టర్స్ మాత్రం తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలం అవుతూ ఉండటం విచారకరం అనే చెప్పాలి. ఇక తమిళ్ ఆడియన్స్ తమ సినిమాలను తమ వాళ్ళని తప్పితే వేరే ఇండస్ట్రీ వాళ్ళని చాలా కొన్ని సందర్బాలలో తప్పితే…
మిగిలిన అన్ని సందర్బాలలో నిరాశనే మిగిలింది. లేటెస్ట్ గా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కోలివుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల కాంబినేషన్ లో తెరకెక్కిన కస్టడీ మూవీ అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అవ్వగా సినిమా…
తమిళనాడులో తమిళ్ డైరెక్టర్ నే తెరకెక్కించినా కూడా మినిమమ్ పట్టించుకోలేదు. తెలుగు తమిళ్ లో బైలింగువల్ గా తెరకేక్కినా కూడా మినిమమ్ ఓపెనింగ్స్ ని కూడా అందుకోలేక పోయిన సినిమా కేవలం 15 లక్షల రేంజ్ లోనే షేర్ ని 2 రోజుల్లో సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది.
కోలివుడ్ డైరక్టర్ తోనే తెరకెక్కిన సినిమాకి మరోసారి నిరాశ పరిచే ఓపెనింగ్స్ రావడంతో మరోసారి కోలివుడ్ ఆడియన్స్ టేస్ట్ ఎలా ఉంటుందో అర్ధం అయిపొయింది. తెలుగులో కూడా నిరాశ పరిచిన కస్టడీ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.