Home న్యూస్ ఆ బ్లాక్ బస్టర్ కి నో చెప్పి నాగ చైతన్య తప్పు చేశాడా!

ఆ బ్లాక్ బస్టర్ కి నో చెప్పి నాగ చైతన్య తప్పు చేశాడా!

1

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హాట్రిక్ విజయాల తర్వాత లాస్ట్ ఇయర్ థాంక్ యు సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా ఈ సినిమా అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరచగా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా బెటర్ గా కలెక్షన్స్ ని…

బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ సినిమా కథను ఓకే చేసే ముందే నాగ చైతన్య ఈ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మానాడు సినిమా తెలుగు రీమేక్ ని నాగ చైతన్యకి వినిపించగా…

ఆల్ రెడీ ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా చూసేయడంతో ఈ సినిమా రీమేక్ కి నో చెప్పి కస్టడీ సినిమాకి ఓకే చెప్పాడు. కానీ ఇప్పుడు కస్టడీ ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా మంది కనీసం మానాడు రీమేక్ ని ఓకే చేసి ఉన్నా కూడా మినిమమ్ ఎంటర్ టైన్ మెంట్ అలాగే…

కమర్షియల్ వాల్యూస్ ఉన్న మూవీ అవ్వడంతో ఓపెనింగ్స్ అయినా బాగా వచ్చి ఉండేవని అభిప్రాయపడుతున్నారు. తెలుగు ఆడియన్స్ కి చాలా వరకు కథ ముందే తెలిసినా ట్రీట్ మెంట్ మార్చి తెరకెక్కించి ఉంటే కస్టడీ కన్నా మానాడునే ఎక్కువగా వర్కౌట్ అయ్యి ఉండేదేమో అని అనుకుంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు కస్టడీ అయితే నాగ చైతన్యకి మరో నిరాశని మిగిలించింది అని చెప్పాలి.

Custody 1st Day Total Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here