2016 టైంలో ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన బిచ్చగాడు సినిమా ఏ రేంజ్ లో హిస్టరీ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. టెలివిజన్ లో కూడా సంచలనం సృష్టించిన ఈ సినిమా సీక్వెల్ అంటే ఆటోమాటిక్ గా హైప్ రావడం ఖాయం. బిచ్చగాడు2 ట్రైలర్ కూడా కథని రివీల్ చేయకున్నా కూడా మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన బిచ్చాగాడు2 సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా సినిమా స్టొరీ పాయింట్ కి వస్తే… విజయ్ గురుమూర్తి(హీరో1)…సత్య( హీరో)…ఒకేలా ఉన్నప్పటికీ ఇద్దరి బ్యాగ్రౌండ్ వేరు…ఒకరు మల్టీ మిలియనీర్ కాగా మరొకరు తప్పిపోయిన తన సిస్టర్ ని వెతుకుతాడు… ఇలాంటి టైంలో ఒక ఎక్స్ పెరిమెంట్ వలన విజయ్ గురుమూర్తి ప్లేస్ లో సత్య వస్తాడు… ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
బిచ్చగాడు 1 వచ్చినప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది… బాగా డబ్బున్న హీరో తన తల్లి అనారోగ్యంతో భాదపడుతున్న టైంలో డబ్బు తనని కాపాడలేని స్థితిలో బిచ్చగాడిలా మారితే తన తల్లిని కాపాడుకోవచ్చు అని తెలుసుకుని తన తల్లిని కాపాడుకుంటాడు…. చాలా సింపుల్ పాయింట్ తో వచ్చిన ఈ స్టొరీ ఆడియన్స్ కి తల్లి కొడుకుల సెంటిమెంట్ బాగా కనెక్ట్ అవ్వడంతో ఊహకందని విజయాన్ని అందుకుంది.
ఇక పార్ట్ 2 మాత్రం ఓవర్ ది టాప్ కి వెళ్ళినట్లు కథ అనిపించగా సినిమా ఓపెన్ అవ్వడం మాత్రం చాలా బాకా ఆసక్తిని పెంచగా తర్వాత మాత్రం కథ పడుతూ లేస్తూ సాగగా ఇంటర్వెల్ వరకు పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ కథ మాత్రం అన్ వాంటెడ్ ఫ్లాష్ బ్యాక్ తో పెద్దగా ఎమోషనల్ కనెక్ట్ లేక పోవడంతో మొదటి పార్ట్ తో పోల్చితే ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ చాలా తక్కువగా అనిపించింది.
విజయ్ ఆంటోనీ పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ కూడా కొన్ని సీన్స్ కే పరిమితం అవ్వగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా, పాటలు యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు అనిపించింది.
ఎంత వద్దూ అనుకున్నా కూడా బిచ్చగాడుతో ఈ బిచ్చగాడు2 కంపారిజన్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి పార్టు పార్టులుగా కొన్ని చోట్ల సినిమా ఆకట్టుకున్నా కూడా చాలా వరకు కథ అనేక షేడ్స్ తో కలిపి ఉండటం, ఎమోషనల్ పార్ట్ కొంచం ఎక్కువగా అనిపించడంతో కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. బిచ్చగాడుతో పోల్చి చూడకుండా….
ఒక నార్మల్ మూవీ చూడబోతున్నాం అన్న అంచనాలతో వెళితే కొంచం బోర్ ఫీల్ అయినా పార్టు పార్టులుగా సినిమా కొద్ది వరకు మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా రొటీన్ స్టొరీ పాయింట్ తో వచ్చిన బిచ్చగాడు2 మూవీ బిచ్చగాడుతో పోల్చితే మాత్రం ఒకింత నిరాశ పరిచింది కానీ పోల్చకుండా చూస్తె కొంచం బోర్ ఫీల్ అయ్యే సీన్స్ ఉన్నప్పటికీ కొంచం ఓపికతో చూస్తె సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంది… మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…