Home న్యూస్ ఎంజాయ్ చేయడం వదిలేసి…రికార్డుల కోసం కొట్టుకుంటున్నారు!!

ఎంజాయ్ చేయడం వదిలేసి…రికార్డుల కోసం కొట్టుకుంటున్నారు!!

1

టాలీవుడ్ లో హీరోల బర్త్ డే ల టైంలో ఏవో ఒక ఈవెంట్స్ చేయడం అన్నది అందరి హీరోల ఫ్యాన్స్ ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నారు. మూడేళ్ళ క్రితం లాక్ డౌన్స్ ల టైంలో ట్విట్టర్ ట్రెండ్స్ ను మొదలు పెట్టిన ఫ్యాన్స్ ప్రతీ హీరో పుట్టిన రోజు టైంలో మిలియన్స్ లో ట్వీట్స్ వేసి ఒక పక్కా రికార్డులు కొడుతూనే మరో పక్క మా రికార్డ్ ఇది మీ రికార్డ్ ఇదీ అంటూ సోషల్ మీడియాలో గోల గోల చేశారు…

ఇది ఏడాది…ఏడాదిన్నర దాకా సాగగా లాస్ట్ ఇయర్ మహేష్ బాబు పుట్టిన రోజు టైంలో పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు. కొన్ని చోట్ల షోలతో మొదలైన ఈ ట్రెండ్ హౌస్ ఫుల్స్ పడుతున్న కొద్దీ షోలు పెరిగిపోయాయి. ఆ షోలకు వచ్చిన రెస్పాన్స్ అండ్ కలెక్షన్స్ చూసి…. సోషల్ మీడియాలో మా రికార్డ్ ను ఇక ఎవ్వరూ కొట్టలేరు అంటూ కామెంట్స్ చేశారు…

AP-TG 9th Day Highest Share Movies

దాంతో ఇతర హీరోల ఫ్యాన్స్ ముందు పోకిరి షోల సెలబ్రేషన్స్ ని చూసి మా హీరోల ఓల్డ్ మూవీస్ ని కూడా ఇలానే సెలెబ్రేట్ చేసుకోవాలి అని ముందు అనుకున్నా కూడా తర్వాత పోకిరి కలెక్షన్స్ సవాల్ ముందు సెలబ్రేషన్స్ జరిగినా ముందు కలెక్షన్స్ ని బీట్ చేయాలని ఎక్కువ షోలు వేసుకుని జల్సాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రికార్డ్ కొట్టారు…

ఇక తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఇవేవి పట్టించుకోకుండా లిమిటెడ్ షోలతో బిల్లా, వర్షం సినిమాలను ఎంజాయ్ చేయగా… న్యూ ఇయర్ కి పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రీ రిలీజ్ ఓవరాల్ గా రీ రిలీజ్ మూవీస్ లో ఒక సంచలనం సృష్టించి భారీ వసూళ్ళని అందుకుంది… ఆ తర్వాత ఈ కలెక్షన్స్ నే బీట్ చేయాలనీ అందరు హీరోల ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు… ఇక్కడ పోకిరి కానీ, ఖుషి కానీ తర్వాత వచ్చిన ఆరెంజ్ కానీ…

ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ నుండి భారీ సపోర్ట్ ఉండటం వలెనే రెస్పాన్స్ అలా వచ్చింది… కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన సింహాద్రి సినిమా కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు మాత్రమే పరిమితం అయింది… న్యూట్రల్ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ చాలా తక్కువే వచ్చినా ఫ్యాన్స్ చాలా వరకు సినిమాను చూడటానికి థియేటర్స్ కి ఎగబడ్డారు, భారీ సెలెబ్రేషన్స్ తో రచ్చ రచ్చ చేశారు కూడా….

AP-TG 8th Day Highest Share Movies!!

దాంతో వసూళ్లు భారీగానే వచ్చినా ఖుషి కలెక్షన్స్ ని అందుకోలేదు. ఇక సోషల్ మీడియాలో అందరు హీరోల ఫ్యాన్స్ సినిమా కలెక్షన్స్ పరంగా ఇవి ఫేక్, ఇవి నిజం అంటూ గొడవ పడుతూ సినిమాను ఎలా సెలెబ్రేట్ చేసుకున్నాం, ఎంతలా ఎంజాయ్ చేశాం అన్నది మరిచిపోయి కలెక్షన్స్ కోసం కొట్టుకుంటున్నారు…. లాస్ట్ ఇయర్ కేవలం సెలెబ్రేషన్స్ కోసమే స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు కలెక్షన్స్ పరంగా అందరి ఫ్యాన్స్ కి సవాల్ గా మారిపోయింది. చూస్తుంటే మరికొంత టైం ఈ ట్రెండ్ ఇలానే సాగేలా కూడా కనిపిస్తుంది…

కొత్త సినిమాల రిలీజ్ టైంలో ఎంత వద్దూ అనుకున్నా ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది సోషల్ మీడియాలో… ఇప్పుడు వాటికి తోడూ రీ రిలీజ్ ల కోసం కూడా సోషల్ మీడియాలో కొట్టుకోవడం హద్దులు మీరి పోతుంది… ఈ రీ రిలీజ్ ల పరంగా గొడవలు ఆగాలి అంటే…ఎక్కడా కూడా కలెక్షన్స్ లాంటివి రిలీజ్ చేయకుండా ఉంటే కొద్ది వరకు గొడవలు ఆగే అవకాశం ఉంటుంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారా లేదా… మూవీ ని సెలెబ్రేట్ చేసుకున్నారా అని చూసి ఆ కలెక్షన్స్ ని చెప్పకుండా ఉంటే కొంచం గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది.

AP-TG 10th Day Highest Share Movies

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here