ఒకప్పుడు చిత్రం, నువ్వు నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ తేజ తర్వాత టైంలో ఒక్క నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మాత్రమే ఆడియన్స్ ను మెప్పించాడు, మిగతా ఏ సినిమాలు కూడా ఆడియన్స్ ను మినిమమ్ కూడా అలరించలేకపోయాయి. ఇలాంటి టైంలో దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా అభిరాం ను లాంచ్ చేస్తూ అహింస అనే సినిమా చేయగా ఎప్పటి నుండో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా డిలే అవుతూ రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… హీరో హీరోయిన్స్ బావామరదళ్ళు కాగా వీళ్ళకి పెళ్లి చేయాలనీ వీళ్ళ పేరెంట్స్ అనుకుంటూ ఉండగా అనుకోకుండా హీరోయిన్ ను ఇద్దరు రేప్ చేస్తారు…ఆ తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది. గొడవలకు దూరంగా ఉండే హీరో ఎలా తన హీరోయిన్ ని రేప్ చేసిన వాళ్ళ పై రివేంజ్ తీసుకున్నాడు అన్నది కథ పాయింట్….
అతి సాదారణంగా కథతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ ఫ్రేం నుండే ఔట్ డేటెడ్ ఫీలింగ్ ను కలిగిస్తుంది, ఏ ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం ఒకప్పటి తేజని గుర్తు చేసినట్లు అనిపించినా అప్పటికే ఆడియన్స్ ఓపిక మొత్తం నశించిపోతుంది. హీరోగా అభిరాం నటన సో సో గానే ఉండగా హీరోయిన్ పర్వాలేదు అనిపిస్తుంది. కథ స్క్రీన్ ప్లే పరమ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తాయి సినిమాలో.
ఫస్టాఫ్ కే జనాలు ఏం సినిమా రా బాబు అని అనుకునేలా చేసిన అహింస, సెకెండ్ ఆఫ్ లో కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా ఓవరాల్ గా మాత్రం పరమ రొటీన్ మూవీగా ముగుస్తుంది. తేజ ఇప్పటికీ నువ్వు నేను జయం టైం నాటి కథ స్క్రీన్ ప్లేలనే ఫాలో అవుతూ ఉండటం విచారకరం. అప్పటి యూత్ కి ఆ కాన్సెప్ట్ లు నచ్చాయి కానీ..
ప్రజెంట్ ఆడియన్స్ టేస్ట్ కంప్లీట్ గా మారిపోయింది. ఇలాంటి రొటీన్ కథలను అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఆడియన్స్… అహింస అని పేరు పెట్టినా కూడా సినిమా ఆడియన్స్ ను చాలా వరకు మాత్రం హింసించేలానే ఉందని చెప్పాలి. పార్టు పార్టులుగా ఎంత ఓపికతో చూస్తె తప్పితే సినిమాను ఒకసారి చూడటం కూడా కష్టమే… సినిమాకి మా రేటింగ్ 2 స్టార్స్.