బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో నేను స్టూడెంట్ సర్ ఒకటి. కొంచం ప్రమోషన్స్ ని బాగానే సొంతం చేసుకున్న ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక ఓపెనింగ్స్ పరంగా కూడా సినిమా ఏమంత జోరుని అయితే చూపించ లేక పోయింది అని చెప్పాలి ఇప్పుడు.
సినిమా రిలీజ్ అవ్వడం టోటల్ గా 220 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా మొదటి రోజు సినిమా పెద్దగా జోరు చూపించలేదు. సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 25-30 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుందని చెప్పాలి. డెఫిసిట్ లు అండ్ నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా వర్త్ షేర్…
అటూ ఇటూగా 12 లక్షల రేంజ్ లో ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుందని సమాచారం. సినిమా బిజినెస్ లెక్కలు ఏమి క్లియర్ గా రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ లెక్కల్లో వాల్యూ బిజినెస్ రేంజ్ 2.3 కోట్ల దాకా ఉంటుందని అంచనా…
ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.5 కోట్ల దాకా అయినా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇక మొదటి రోజు సినిమా సాధించిన ఓపెనింగ్స్ కాకుండా ఇంకా చాలా దూరమే పరుగును కొనసాగించాల్సిన అవసరం ఉంది, సినిమాలో కొంచం ఆసక్తిని కలిగించే సీన్స్ ఉన్నప్పటికీ కొంచం ఓపికతో సినిమా చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.