కోలివుడ్ నంబర్ 1 హీరో దళపతి విజయ్ విక్రమ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో మాస్టర్ లాంటి హిట్ కొట్టిన తర్వాత చేస్తున్న రెండో సినిమా లియో…. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సినిమా అన్న వాదన గట్టిగా వినిపిస్తూ ఉండగా సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి…
ఈ సినిమా పై హైప్ నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఈ దీపావళి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి ఇప్పుడే బిజినెస్ ఆఫర్స్ మరో లెవల్ లో సొంతం అవుతున్నాయి.
సినిమాకి రీసెంట్ గా కేరళ ఏరియాలో ఆల్ టైం మమ్మోత్ బిజినెస్ సొంతం అయ్యింది. విజయ్ నటించిన రీసెంట్ మూవీ వారిసు సినిమాకి ఇక్కడ 6.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అవ్వగా టోటల్ రన్ లో 7 కోట్ల లోపు షేర్ ని అందుకుని హిట్ కొట్టాడు. కానీ ఇప్పుడు లియో సినిమా మీద..
ఉన్న భారీ అంచనాల దృశ్యా ఏకంగా 16 కోట్ల రేంజ్ మమ్మోత్ రేటుకి ఈ సినిమాను అమ్మినట్లు తెలుస్తుంది. విక్రమ్ మూవీ అక్కడ ఓ రేంజ్ లో సంచలనం సృష్టించడం, అలాగే విజయ్ కి అక్కడ తిరుగులేని క్రేజ్ ఉండటం వలనే ఈ రేంజ్ బిజినెస్ సొంతం అయ్యిందని అంటున్నారు. ఈ మొత్తం రికవరీ అవ్వాలి అంటే 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా కేరళలో సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.