Home న్యూస్ ఓరినీ…గోలీమార్ తర్వాత మళ్ళీ ఇప్పుడే!

ఓరినీ…గోలీమార్ తర్వాత మళ్ళీ ఇప్పుడే!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. సీటిమార్ ఒక్క సినిమా కొంచం పర్వాలేదు అనిపించినా కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మాత్రం అందుకోలేక పోయింది.

తర్వాత చేసిన పక్కా కమర్షియల్ మరియు రామ బాణం(Rama Banam) మూవీస్ రెండూ కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ రొటీన్ మూవీస్ ని పక్కకు పెట్టి డిఫెరెంట్ మూవీస్ చేయాలనీ అందరూ కోరుకోగా…

అందరూ కోరుకున్నట్లే గోపీచంద్ ఇప్పుడు భీమా(Bhimaa) అనే డిఫెరెంట్ మూవీ చేస్తున్నాడు, ఈ సినిమాలో గోపీచంద్ పోలిస్ రోల్ చేస్తూ ఉండగా తన కెరీర్ లో చివరి సారి గోపీచంద్ పోలీస్ రోల్ లో నటించిన సినిమా వచ్చి 13 ఏళ్లకు పైగా టైం అవుతూ ఉంది….

ఆ సినిమానే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన గోలీమార్ మూవీ…ఆ సినిమా తర్వాత ఎందుకనో గోపీచంద్ పోలీస్ రోల్ అయితే నటించలేదు. మళ్ళీ ఇప్పుడు ఆల్ మోస్ట్ 13 ఏళ్ల తర్వాత తిరిగి పోలీస్ రోల్ లో భీమా సినిమాలో కనిపించ బోతున్న గోపీచంద్…

ఫుల్ మాస్ కంటెంట్ తో రగ్గుడ్ లుక్ తో రాబోతున్నాడు…. ఫ్రెష్ కాంబినేషన్ లో మాస్ కంటెంట్ తో రాబోతున్న గోపీచంద్ గోలీమార్ తో అప్పట్లో బాగానే మెప్పించాడు. ఇప్పుడు తిరిగి ఇన్నేళ్ళకి ఫుల్ పోలీస్ రోల్ లో భీమాతో రాబోతున్న గోపీచంద్ ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here