Home న్యూస్ ఆది పురుష్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!

ఆది పురుష్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!

1

Adi Purush Movie REVIEW: పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుష్(Adi Purush) వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. సుమారు 7000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆది పురుష్ మూవీ ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకోగా…

అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది… సినిమా స్టొరీ పాయింట్ అందరికీ తెలిసిన రామాయణ కథనే అయినా కానీ మొదలు పెట్టిన విధానం, తర్వాత కథ మొత్తం కూడా ఆసక్తిగా తెరకెక్కించారని చెప్పొచ్చు. కథ అందరికీ తెలిసిందే అయినా కూడా…

విజువల్స్ పరంగా మాత్రం అబ్బుర పరిచే గ్రాండియర్ తో చాలా రిచ్ గా సినిమా ఉందని అంటున్నారు, కొన్ని కొన్ని చోట్ల 3D షాట్స్ నిజంగానే మెస్మరైజ్ చేయడం ఖాయమని అంటున్నారు, రాముడిగా ప్రభాస్ ఎంత బాగా సెట్ అయ్యాడో తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ డైలాగ్స్ కానీ అద్బుతంగా మెప్పించాయని అంటున్నారు..

ఓవరాల్ గా ఫస్ట్ సీన్ కే మనం సినిమాతో ఇన్వాల్వ్ అయిపోతామని తర్వాత కథ అందరికీ తెలిసిందే అయినా ప్రతీ పాత్ర పరిచయం కానీ ఆ పాత్రను చూపించిన విధానం చాలా బాగున్నాయని అంటున్నారు… కానీ ఓవరాల్ గా లెంత్ ఒక్కటి కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినప్పటికీ…

సినిమా వర్త్ వాట్చ్ అనిపించే రేంజ్ మైతలాజికల్ మూవీ అని అంటున్నారు. హనుమాన్ లంకలో అడుగు పెట్టినప్పటి నుండి వచ్చే సీన్స్, తర్వాత ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ అనుకున్న దానికన్నా చూసినప్పుడు చాలా బాగా ఆకట్టుకున్నాయని అంటున్నారు…

రావణాసురుడి గెటప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, గ్రాఫిక్స్ కొన్ని చోట్ల క్వాలిటీ ఇంకాస్త బాగుండాల్సింది అని చెబుతున్నారు… ఓవరాల్ గా సినిమా ప్రీమియర్స్ ను పూర్తీ చేసుకున్న తర్వాత మంచి టాక్ ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు…

రీసెంట్ టైంలో ఒక మైతలాజికల్ మూవీకి ఇలాంటి రెస్పాన్స్ రావడం ఒక్క ఆది పురుష్ కే చెల్లిందని చెప్పొచ్చు, కొన్ని చోట్ల గ్రాఫిక్స్, అలాగే సినిమా లెంత్ కొంచం ఇబ్బంది ఎత్తినా కానీ సినిమా చూసి బయటికి వచ్చే ఆడియన్స్ కచ్చితంగా మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో వస్తారని అంటున్నారు…

ఫైనల్ గా ప్రీమియర్స్ ను పూర్తీ చేసుకున్న తర్వాత ఆది పురుష్ సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు, హిట్టు ఫ్లాఫ్ లాంటివి పక్కకు పెట్టి ఎప్పుడో కానీ వచ్చే ఇలాంటి మైతలాజికల్ మూవీస్ ని ఒక్కసారి అయినా థియేటర్స్ లో చూసి తీరాల్సిందే. ఇక రెగ్యులర్ షోలకు సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here