బాక్స్ ఆఫీస్ దగ్గర Prabhas నటించిన లేటెస్ట్ మూవీ Adi Purush వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్న సినిమా 6వ రోజు అనుకున్న రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 7వ రోజు మరోసారి…
వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన ఆదిపురుష్ సినిమా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా హిందీలో కూడా సినిమా 30-35% రేంజ్ లో డ్రాప్స్ ను ట్రాక్ చేసిన సెంటర్స్ లో సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే విధంగా ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా హిందీలో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా అటూ ఇటూగా 2.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది. కర్ణాటకలో అలాగే ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా మిగిలిన చోట్ల హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.
మొత్తం మీద వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ లో డ్రాప్స్ ను అందుకోవడం బ్రేక్ ఈవెన్ అవకాశాలను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది… ఇక రెండో వీక్ లో పెద్దగా నోటబుల్ మూవీస్ లేక పోవడంతో సినిమా ఎంతో కొంత సినిమా తేరుకునే అవకాశం కొద్ది వరకు ఉంది కానీ సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.