బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి వారంలో ఓవరాల్ గా యావరేజ్ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా వీకెండ్ లో హిస్టారికల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత…
వర్కింగ్ డేస్ లో కుప్పకూలిపోయింది అని చెప్పాలి. ఇక సినిమా ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రెండో వారంలో భారీగా హోల్డ్ చేసి షేర్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
సినిమా ఇక రెండో వారంలో అడుగు పెట్టిన తర్వాత థియేటర్స్ కౌంట్ భారీగా తగ్గిపోయింది ఇప్పుడు. ఆదిపురుష్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 1100 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా రెండో వారానికి వచ్చేసరికి ఇప్పుడు సగానికి పైగా థియేటర్స్ తగ్గాయి…
సినిమా ఇప్పుడు రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా నోటబుల్ మూవీస్ ఏమి లేక పోయినా కానీ అండర్ పెర్ఫార్మ్ చేసిన థియేటర్స్ నుండి సినిమాను తొలగించారు. దాంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ రెండో వారంలో 450 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది.
ఇది పెద్ద సినిమాలకు కామనే కాని సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ థియేటర్స్ సరిపోవు అనే చెప్పాలి. కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ గా రెండో వీకెండ్ లో హోల్డ్ చేసి ఎంతో కొంత నష్టాలను తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.