బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రెండో వారంలో ఎట్టకేలకు వీకెండ్ అడ్వాంటేజ్ తో మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే విధంగా గ్రోత్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగించడం విశేషం…
కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి ఇప్పుడు. సినిమా టోటల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 123.6 కోట్ల గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 369.7 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమా 10వ రోజున…
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 2 కోట్ల నుండి 2.2 కోట్ల మధ్యలో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు 3.6 కోట్ల నుండి 3.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా…
ఇప్పుడు 6.8 కోట్ల రేంజ్ నుండి 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 126 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 376 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
అన్ని చోట్లా సినిమా 9వ రోజు లెవల్ లో కలెక్షన్స్ కొంచం గ్రోత్ ని చూపిస్తే లెక్క కొంచం పెరగవచ్చు. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న నెగిటివిటీల నడుమ సినిమా ఉన్నంతలో నష్టాలను కొద్ది వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 10 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.