బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రెండో వీకెండ్ లో ఎలాగోలా కొంచం బెటర్ కలెక్షన్స్ నే సాధించింది ఇప్పుడు. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా కలెక్షన్స్ నే…
సినిమా లాంగ్ రన్ లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదటి వారం ఎండ్ టైంలో వర్కింగ్ డేస్ లో సినిమా టికెట్ రేట్స్ ను కొన్ని మల్టిప్లెక్సులలో తగ్గించేసి 150 గా పెట్టారు….
కానీ ఈ ఆఫర్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు… ఇక సినిమా సెకెండ్ వీకెండ్ తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో మరోసారి మరో కొత్త ఆఫర్ తో మేకర్స్ నేషనల్ మల్టిప్లెక్సులలో ఆఫర్ పెట్టారు….PVR, INOX మరియు CinePolis చైన్ థియేటర్స్ లో ఇప్పుడు…
3D టికెట్ కాస్ట్ 112 గా పెట్టారు ఇప్పుడు… 150 టికెట్ ఆఫర్ అయితే జనాలను అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రప్పించలేక పోయింది కానీ 112 టికెట్ రేటు ఇప్పుడు రీ ఎడిటెడ్ వర్షన్ తో రిలీజ్ చేస్తూ ఉండటంతో జనాలు కొద్ది వరకు పెరిగే అవకాశం…
ఆక్యుపెన్సీ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పాలి. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ ని మించి హోల్డ్ చేసి లాంగ్ రన్ ని ఆదిపురుష్ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.