బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో చాలానే సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రంగి(Rudrangi Review) సినిమా ఒకటి… చిన్న సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉండగా 1940’s టైం నాటి రాజుల కథతో తెరకెక్కిన ఈ సినిమాలో…
ఒక క్రూరమైన రాజుగా జగపతిబాబు(JagapathiBabu) ఆడవాళ్ళ మీద మోహం ఉన్న రాజుగా నటించగా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత రుద్రంగి అనే అమ్మాయిని చూసి మొహిస్తాడు… తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా స్టొరీ పాయింట్… నటన పరంగా జగపతిబాబు నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో…
తనదైన నటనతో మెప్పించాడు…తన డైలాగ్స్, హావభావాలు అన్నీ ఆకట్టుకుంటాయి. మమతామోహన్దాస్, విమలా రామన్ లు మెప్పించగా మిగిలిన రోల్స్ ఉన్నంతలో ఆకట్టుకున్నాయి…ఫస్టాఫ్ వరకు కథ బ్యాగ్ డ్రాప్ ప్రీ ఇండిపెండెన్స్ టైం లో సాగడంతో…
ఫస్టాఫ్ వరకు కథ అక్కడక్కడా స్లో అయినా పర్వేలేదు అనిపించేలా ఉన్నప్పటికీ సెకెండ్ ఆఫ్ స్టోరీ మొత్తం నత్తనడకన సాగడంతో చాలా టైం బోర్ తో సహనానికి పరీక్షగా సినిమా నిలిచింది. పార్టు పార్టులుగా కొన్ని సీన్స్ మెప్పించినా కూడా.
ఓవరాల్ గా సినిమా పరంగా యావరేజ్ రేంజ్ లో సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఆడియన్స్ ముందుకు వస్తున్న రొటీన్ మూవీస్ తో పోల్చితే సినిమా బ్యాగ్ డ్రాప్, బడ్జెట్ లోనే బాగా చూపించిన గ్రాండియర్ నెస్..విజువల్స్ లాంటివి బాగుండటంతో కథలో ఫ్లాస్, సెకెండ్ ఆఫ్ స్లోగా ఉన్నప్పటికీ…
ఓవరాల్ గా కొంచం ఓపికతో చూస్తె పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా ముగుస్తుంది రుద్రంగి సినిమా… సెకెండ్ ఆఫ్ ని కొంచం ట్రిమ్ చేసి స్క్రీన్ ప్లేస్ ని ఇంకొంచం ఫాస్ట్ గా రాసుకుని ఉంటే ఇంకొంచం బాగుండేది అనిపించేదేమో… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్..