ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో చాలానే సినిమాలు రిలీజ్ అవ్వగా టాలీవుడ్ లో చాలా తక్కువగా రూపొందే టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ 7:11PM(7:11PM Movie Review) రిలీజ్ అవ్వగా చిన్న సినిమానే అయినా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండటం…
ట్రైలర్ చూసిన తర్వాత విజువల్స్ కూడా మెప్పించడంతో ఇలాంటి డిఫెరెంట్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూశారు… సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే 1999 టైంలో హంసలదీవి ఊరిలో జరిగే చిట్ ఫండ్ మోసాలను అరికట్టలను చూస్తున్న హీరో…ఒక బస్ ఎక్కిన తర్వాత సడెన్ గా 2024 కి టైం ట్రావెల్ చేస్తాడు…
ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… సినిమా మొత్తం చూసిన తర్వాత ఓవరాల్ గా స్టొరీ పాయింట్ బాగున్నా కానీ మెయిన్ స్టొరీలో అనేక ఉపకథలు ఉండటం, ఒక కథ నుండి మరో కథకి జంప్ అవుతూ ఉండటంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు… ఫస్టాఫ్ లో పెద్దగా కథ లేక పోవడంతో…
సోసోగా సినిమాగా సాగగా సెకెండ్ ఆఫ్ లో అసలు కథ స్టార్ట్ అయినా అక్కడ కూడా కన్ఫ్యూజన్ ని కంటిన్యూ చేసి కేవలం చివరి 15 నిమిషాల్లో చాలా వేగంగా కథని పూర్తీ చేస్తాడు… ఇన్ని లేయర్స్ తో కథను రాసుకోకుండా సింపుల్ పాయింట్ ని స్ట్రైట్ నరేషన్ తో కొన్ని ట్విస్టులతో…
చెప్పి ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే నటించిన వారు అందరూ కూడా కొత్త వారు అవ్వడంతో ఎవ్వరూ పెద్దగా గుర్తు ఉండరు…. కానీ చిన్న సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండటం, కొన్ని చోట్ల గ్రాఫిక్స్ లాంటివి మెప్పించడంతో… కొంచం ఓపిక చేసుకుని చూస్తె….
కథ బోర్ కొట్టినా ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా సినిమా ముగుస్తుంది అని చెప్పొచ్చు…. ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ ను భారీగా నిర్మించినందుకు మేకర్స్ ని మెచ్చుకోవాల్సిందే. కొంచం నోటబుల్ యాక్టర్స్ ను తీసుకుని కొన్ని మార్పులు చేసి ఉంటే కచ్చితంగా సినిమా ఇంకా బాగా ఆకట్టుకుని ఉండేది… మొత్తం మీద సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కొంచం ఓపికతో చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది ఈ సినిమా… ఈ సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్.