Home న్యూస్ హిడింబ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

హిడింబ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో టీసర్, ట్రైలర్ తో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసిన సినిమా హిడింబ(Hidimbha)… థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీసర్ బాగా ఆకట్టుకోగా ట్రైలర్ లో సినిమా కథని ఆల్ మోస్ట్ రివీల్ చేశారు. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…. సిటీలో జరుగుతున్న కొన్ని సీరియల్ కిడ్నాప్ కేసులను సాల్వ్ చేస్తున్న హీరోకి హెల్ప్ గా మరో పోలిస్ ను రప్పిస్తారు… ఆమె హీరోయిన్… వీళ్ళు కలిసి ఈ మిస్టరీని విడదీసే క్రమంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి… ఈ కిడ్నాపుల వెనుక ఎవరున్నారు…ఈ మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా స్టొరీ పాయింట్….

HIDIMBHA MOVIE REVIEW AND RATING
ఆసక్తి కరమైన పాయింట్ ఉన్నా ఆ ఆసక్తిని మెయిన్ టైన్ చేసే స్క్రీన్ ప్లే లేక పోతే చూసే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు… ఇక్కడ కూడా అదే ఫస్టాఫ్ వరకు జరిగింది. అసలు పాయింట్ లోకి వెళ్ళడానికి చాలా టైం పట్టడంలో మధ్య హీరో హీరోయిన్స్ స్టొరీ పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడంతో…

కథలోకి వెళ్ళడానికి ప్రీ ఇంటర్వెల్ వరకు టైం పట్టగా ఇంటర్వెల్ ఎపిసోడ్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉండగా సెకెండ్ ఆఫ్ లో అసలు పాయింట్ ని బాగానే చెప్పినా కానీ డ్రాగ్ అయినట్లు చాలా సార్లు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా సినిమా పాయింట్ బాగుండటంతో కొన్ని బోర్ అండ్ లాగ్ సీన్స్ ఉన్నప్పటికీ కొంచం ఓపికతో చూస్తె…

సినిమా ఒకసారి చూసేలా ఉందని చెప్పాలి…. పెర్ఫార్మెన్స్ పరంగా హీరో అశ్విన్(Ashwin) బాగానే నటించి మెప్పించగా ఫైట్స్ లో కుమ్మేశాడు. హీరోయిన్ నందితా శ్వేత కూడా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ కూడా పర్వాలేదు అనిపిస్తారు. సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఎక్స్ లెంట్ గా ఉండగా కొన్ని చోట్ల లౌడ్ గా అనిపిస్తుంది…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో చాలా సీన్స్ లో పనితనం చూపిస్తే సినిమా మరింత టైట్ స్క్రీన్ ప్లేతో బోర్ ఫీల్ అవ్వకుండా చేసేది… సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ లాగ్ అనిపించినా ఫస్టాఫ్ తో పోల్చితే చాలా బెటర్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా… చెప్పిన విధానం అక్కడక్కడా బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది.

కానీ ఓవరాల్ గా యూనిక్ పాయింట్ ని ఇందులో చెప్పడంతో దాని చుట్ట్రూ కొన్ని లాగ్ సీన్స్ ఉన్నా కొంచం బరిస్తే… థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా బాగానే మెప్పించే అవకాశం ఉండగా రెగ్యులర్ ఆడియన్స్ కొంచం ఓపికపడితే వాళ్ళని కూడా సినిమా పార్టు పార్టులుగా బాగానే మెప్పించే అవకాశం ఉంది…. ఫస్టాఫ్ మీద కొంచం ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది…

ఓవరాల్ గా సినిమాలో యూనిక్ పాయింట్ బాగుండటం, కొన్ని ఫైట్స్ సీన్స్ మెప్పించడం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోవడం లాంటివి ప్లస్ పాయింట్స్ అయితే లాగ్ సీన్స్, లెంత్ అండ్ బోర్ స్క్రీన్ ప్లే అక్కడక్కడా మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయినా కానీ ముందే చెప్పినట్లు థ్రిల్లర్ మూవీ లవర్స్ ని మెప్పించే సినిమా రెగ్యులర్ ఆడియన్స్ కి ఒకసారి చూసేలా ఉందనిపిస్తుంది. సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here