బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వీకెండ్ లో భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ బిగ్గీ బ్రో ది అవతార్(Bro The Avatar) సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి కానీ ఆ అంచనాలను ఇంకా పెంచాలి అంటే సినిమా అఫీషియల్ ట్రైలర్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి డేట్ ని ఫిక్స్ చేశారు. ఈ నెల 22న సినిమా అఫీషియల్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు రాబోతుండగా కచ్చితంగా ఆడియన్స్ ను అలరిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు టీం.
ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ లో ఈ ట్రైలర్ టాలీవుడ్ తరుపున బ్రేక్ చేయాల్సిన వ్యూస్ అండ్ లైక్స్ రికార్డులు కొన్ని ఉండగా ట్రైలర్ ఏ రేంజ్ లో వ్యూస్ అండ్ లైక్స్ తో దుమ్ము లేపుతుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.
ఒకసారి టాలీవుడ్ సినిమాల ట్రైలర్ ల పరంగా మొదటి 24 గంటలలో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ లను గమనిస్తే…
#SarkaruVaariPaata – 26.77M
#RadheShyam – 23.20M
Acharya : 21.86M
Baahubali2 trailer : 21.81M
#RRRMovie – 20.45M
KGF Chapter 2(Dub) – 19.38M
ఇక 24 గంటల్లో టాలీవుడ్ ట్రైలర్ లలో హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
#RRRMovie – 1.24M
#SarkaruVaariPaata – 1.219M
#BheemlaNayak – 1.11M+
VakeelSaab (2021): 1.006M
Pushpa(2021) – 893K
Acharya( 2022) : 838K
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రీవియస్ రెండు సినిమాలు లైక్స్ పరంగా ఇప్పటికీ టాప్ లిస్టులో నిలిచాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతున్న బ్రో మూవీ ట్రైలర్(Bro Movie Trailer) ఏ రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు.