బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanath Kesari) సినిమా ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ కానుండగా సినిమా బాలయ్య కెరీర్ లో బాక్ టు బాక్ హిట్స్ తర్వాత…
వస్తున్న సినిమా అవ్వడం అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) అపజయం లేకుండా దూసుకు పోతున్న డైరెక్టర్ అవ్వడంతో సినిమా మీద హైప్ మరో లెవల్ లో ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా దసరా బరిలో నిలిచిన సినిమా కి…
పోటిగా కోలివుడ్ నంబర్ 1 హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) మోస్ట్ హైప్ మూవీ లియో(Leo Movie) అన్ని సినిమాల కన్నా ముందే దసరాకి రిలీజ్ ను కన్ఫాం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే సినిమా తెలుగు లో కూడా అదే టైంలో రిలీజ్ కానుండగా…
సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుండగా బాలయ్య భగవంత్ కేసరి అక్టోబర్ 20న రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేయగా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ డేట్ ను ఒకరోజు ప్రీ పోన్ చేస్తూ అక్టోబర్ 19నే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాంతో విజయ్ సినిమా అన్ని చోట్లా కుమ్మేసే ఓపెనింగ్స్ ను అందుకున్నా…
తెలుగు లో మాత్రం విజయ్ సినిమాకి బాలయ్య సినిమా సాలిడ్ దెబ్బ కొట్టడం ఖాయమని చెప్పాలి. ఎంత హైప్ ఉన్న మూవీనే అయినా బాలయ్య మూవీ అదే రోజు రావడంతో ఓపెనింగ్స్ బాలయ్య సినిమా ముందు చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇక బాలయ్య ఈ పోటిలో ఏ రేంజ్ లో ఊచకోత కోస్తాడో చూడాలి.