టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో(BRO The Avatar) వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లోనే రిలీజ్ అవుతూ ఉండగా, సినిమా మంచి బజ్ ఉన్నప్పటికీ…
అది పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే కొంచం తక్కువే ఉందని చెప్పాలి. ఇక సినిమా 98.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా, వరల్డ్ వైడ్ గా సుమారు 1550 నుండి 1600 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ఇక సినిమాకి నైజాంలో టికెట్ రేట్స్ హైక్స్ బాగానే ఉన్నప్పటికీ ఆంధ్రలో నార్మల్ రేట్స్ తోనే రిలీజ్ కానుంది. కానీ అదే టైంలో తెలంగాణాలో భారీ వర్షాలు సినిమాకి సిటీల ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటే డిస్ట్రిక్స్ లో మాత్రం భారీ వర్షాల వలన ఇంపాక్ట్ గట్టిగానే ఉండేలా ఉంది…
కానీ శుక్రవారం వర్షాలు తగ్గే అవకాశం ఉండటం, ఆంధ్రలో పరిస్థితులు బెటర్ గానే ఉండటం, పొలిటికల్ గా ఇప్పటి వరకు ఎఫెక్ట్ ఏమి లేకపోవడంతో అక్కడ సినిమా బాగానే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా హైదరాబాదు లో ఇప్పటి వరకు జరిగిన గ్రాస్ బుకింగ్స్ 4.5 కోట్లకు చేరువ అవుతూ ఉండగా నైజాంలో 5 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను…
తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ సొంతం చేసుకుంది…ఇక ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ మార్క్ కి పైగా బుకింగ్స్ జరిగినా లోకేషన్స్ ఇతర బిగ్గీస్ తో పోల్చితే చాలా తక్కువగానే ఈ సినిమా కి సొంతం అయ్యాయి… కానీ ఓపెన్ అయిన చోట్ల మాత్రం బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా బ్రో ది అవతార్ మూవీ AP TG లో ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 18-20 కోట్ల రేంజ్ షేర్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఇప్పుడున్న బుకింగ్స్ ని బట్టి కలెక్ట్ చేసే అవకాశం ఉండగా…
సినిమాకి టాక్ బాగుండి షో షోకి కలెక్షన్స్ లో ఇంప్రూవ్ మెంట్ తో జోరు చూపిస్తే లెక్క పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. మరి సినిమా అనుకున్న అంచనాలను అన్నీ మించిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర మాసివ్ ఓపెనింగ్స్ ను అందుకుంటుందో లేదో చూడాలి ఇప్పుడు.