బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన హిడింబ(Hidimbha) మూవీ మంచి కాన్సెప్ట్ తో వచ్చినా కూడా ఆ కాన్సెప్ట్ తప్పితే మిగిలిన సినిమా పెద్దగా మెప్పించకపోయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ గానే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఉన్నంతలో మొదటి వారంలో…
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.26 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా రెండో వారంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బ్రో మూవీ వలన థియేటర్స్ నుండి చాలా వరకు తొలగిపోయింది ఈ సినిమా… ఓవరాల్ గా సినిమాకి థియేట్రికల్ రన్ లో…
మరీ మేజర్ గా నష్టాలేమి లేవనే చెప్పాలి. ఇక 10 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ క్లిక్ అవ్వడం కాన్సెప్ట్ ముందే ఆసక్తిని సినిమా మీదే కలిగేలా చేయడంతో సినిమాకి రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి రేటుని సొంతం చేసుకుందట.
ఆల్ మోస్ట్ 8 కోట్ల దాకా రేటు టోటల్ గా డిజిటల్, శాటిలైట్ మరియు డబ్బింగ్ రైట్స్ కింద సినిమాకి సొంతం అయ్యిందని అంటున్నారు. అంటే 10 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాకి 8 కోట్ల రేంజ్ రేటు నాన్ థియేట్రికల్స్ ద్వారానే రికవరీ అయ్యాయి.
సినిమా కొంచం ఆడియన్స్ అంచనాలను అందుకుని ఉంటే కచ్చితంగా మంచి కలెక్షన్స్ తో జోరు చూపించి మేకర్స్ కి మంచి లాభాలను సొంతం చేసుకుని ఉండేది. ఇక రెండో వారంలో ఉన్న చాలా తక్కువ థియేటర్స్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.