బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందు అంతంతమాత్రమే బజ్ తో వచ్చినా…
పవన్ కళ్యాణ్ పేరు మీద రిలీజ్ రోజున ఉన్నంతలో మంచి ఓపెనింగ్స్ తో ప్రస్తుత పరిస్థితులలో కూడా కుమ్మేసింది అని చెప్పాలి. వర్షాల ఇబ్బందుల వలన నైజాంలో జిల్లాలలో కలెక్షన్స్ కి ఇబ్బంది పడగా, నైట్ షోలకు ఎక్స్ లెంట్ ట్రెండ్ ఉంది… సీడెడ్ లో సినిమా కి పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే లో బజ్ వలన…
BRO The Avatar 1st Day Box Office Collections Report
బుకింగ్స్ మరీ అనుకున్న రేంజ్ లో లేవు. కానీ ఆంధ్రలో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ స్టార్ట్ నే సొంతం చేసుకోగా డే 1 ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా అనుకున్న దాని కన్నా బెటర్ ట్రెండ్ తో దూసుకు పోతుంది… ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రేంజ్ నుండి…
22 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అది కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే అవకాశం కూడా ఉన్న నేపధ్యంలో సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సేఫ్ సైడ్ లో ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఎక్కువ.
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 28 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటే తప్పితే సినిమా ఈ అంచనాలను అందుకోవడమో లేక మించిపోవడమో చేసే అవకాశం ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే ఈ ఓపెనింగ్స్ చాలా తక్కువే అని చెప్పాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, సినిమా జానర్ అండ్ సినిమా మీద ముందే ఏర్పడ్డ బజ్ దృశ్యా ఈ కలెక్షన్స్ కూడా మాస్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.