బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(BRO The Avatar) వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు క్రూసియల్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది ఇప్పుడు.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు హోల్డ్ ని బట్టి లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటుందో లేదో అన్నది ఆదారపడి ఉంటుంది అని చెప్పాలి. కాగా సినిమా మూడో రోజుతో పోల్చితే ఇతర పెద్ద సినిమాల మాదిరిగానే ఓవరాల్ గా గట్టి డ్రాప్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు.
తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు మూడో రోజుతో పోల్చితే అటూ ఇటూగా 60-70% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎలా హోల్డ్ ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా ప్రజెంట్ డ్రాప్స్ ను బట్టి…
సినిమా అటూ ఇటూగా ఈ రోజు 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు… కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
వర్కింగ్ డే లో బాగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి మొత్తం మీద 6 కోట్లకు పైగా షేర్ ని ఈ రోజు అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మరి సినిమా డే ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో టార్గెట్ కి ఎంతవరకు దగ్గర అవుతుందో చూడాలి.