బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల టాక్ ఎలా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన సినిమాల వీకెండ్ కలెక్షన్స్ మాత్రం కుమ్మేశాయి. ఉన్నంతలో రీసెంట్ మూవీస్ లో భీమ్లా నాయక్ సినిమా కి మంచి పాజిటివ్ టాక్ రాగా వీకెండ్ లో వీర విహారం చేసింది.
కానీ హిట్ టాక్ తెచ్చుకున్న భీమ్లా నాయక్ కానీ మిక్సుడ్ రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఇతర సినిమాలు కానీ వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత అనుకున్న దాని కన్నా కూడా భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి…
బ్రో మూవీ(BRO The avatar) సినిమా కి కూడా మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినా సినిమా మినిమమ్ హోల్డ్ ని అయినా చూపిస్తుంది అనుకున్నా అలా ఏమి జరగలేదు. సినిమా కేవలం 2.36 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు.
ఒకసారి పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్ 4వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
#PawanKalyan Recent Movies 4th Day AP TG Shares
👉#BROTheAvatar – 2.36Cr*****
👉#BheemlaNayak – 5.18Cr
👉#VakeelSaab – 4.19Cr
👉#Agnyaathavaasi -1.82Cr~
👉#katamarayudu – 2.33Cr
👉#SardaarGabbarSingh – 2.15Cr
మొత్తం మీద రీసెంట్ మూవీస్ లో భీమ్లా నాయక్ సినిమా 4వ రోజు బెటర్ గా ట్రెండ్ అవ్వగా మిగిలిన సినిమాల్లో కోవిడ్ లో వకీల్ సాబ్ ఒక్కటి డీసెంట్ గా హోల్డ్ చేసింది. మిగిలిన సినిమాలు అన్నీ 4వ రోజు తీవ్రంగా డ్రాప్ అయ్యాయి.
అజ్ఞాతవాసి అయితే 4వ రోజు శనివారం అయినా కూడా తీవ్రంగా డ్రాప్ అయింది. ఇక ఇప్పుడు బ్రో మూవీ అనుకున్న దానికన్నా భారీ ఎక్కువగా డ్రాప్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశాలు తగ్గేలా చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు.