బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని అందుకున్నా కూడా వర్కింగ్ డే కి వచ్చే సరికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్రో మూవీ(BRO The Avatar) సినిమా 4వ రోజు అనుకున్న దాని కన్నా కూడా భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది.
సినిమా 3వ రోజుతో పోల్చితే 4వ రోజు ఏకంగా 77% వరకు డ్రాప్ అవ్వగా ఇక ఇప్పుడు 5వ రోజులో ఎంటర్ అయిన బ్రో మూవీ మరోసారి హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. ఆల్ మోస్ట్ 4వ రోజుతో పోల్చితే సినిమా ఇప్పుడు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…
అటూ ఇటూగా 25-30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఆఫ్ లైన్ లో కూడా ఇదే విధంగా డ్రాప్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ నుండి…
1.6 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల నుండి 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక డే ఎండ్ అయ్యే టైంకి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా గ్రోత్ ని చూపించి కలెక్షన్స్ పరంగా గ్రోత్ ఉంటే 2 కోట్లకి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.