బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ స్టార్టింగ్ లో సంక్రాంతికి భారీ లెవల్ లో బ్లాక్ బస్టర్ ను వాల్తేరు వీరయ్య(Waltair veerayya) తో సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన కొత్త సినిమా భోలా శంకర్(Bhola Shankar) సినిమా….
ఆడియన్స్ ముందుకు ఆగస్ట్ 11న రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉండగా సినిమా మీద డీసెంట్ అంచనాలు అయితే ఉన్నాయి కానీ మరోసారి వాల్తేరు వీరయ్య లాంటి టాక్ అండ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే ఇక కలెక్షన్స్ పరంగా జోరు చూపించే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా కి ప్రీ రిలీజ్ బిజినెస్ ముందు భారీ ఆఫర్స్ ను మేకర్స్ కోట్ చేసినా కానీ తర్వాత ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని సేఫ్ సైడ్ లో సినిమా బిజినెస్ ను చేస్తూ ఉండగా సినిమా రీసెంట్ గా సీడెడ్ లో 12 కోట్ల ప్రీ రిలీజ్ ను సొంతం చేసుకోగా…
ఇప్పుడు నైజాం ఏరియాలో కూడా సినిమా బిజినెస్ కంప్లీట్ ఆయింది. ఇది వరకు 30 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ ను కోట్ చేసినా కూడా తర్వాత మాత్రం పరిస్థితులను అర్ధం చేసుకున్న టీం ఇప్పుడు నార్మల్ రేట్ నే ఫైనల్ చేసి బిజినెస్ ను కన్ఫాం చేసుకున్నారట.
మొత్తం మీద సినిమాకి నైజాం ఏరియాలో ఇప్పుడు వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ 22.50 కోట్ల దాకా సొంతం చేసుకోగా టాక్ బాగుంటే వీకెండ్ కే చాలా మొత్తం రికవరీ అయ్యే అవకాశం ఉంది. వాల్తేరు వీరయ్య సినిమా నైజాంలో 18 కోట్ల బిజినెస్ ను అందుకుని టోటల్ రన్ లో 36.26 కోట్ల షేర్ ని అందుకుంది.
అంతటి బ్లాక్ బస్టర్ తర్వాత భారీ బిజినెస్ ను అందరూ ఊహించి ఉంటారు కానీ మేకర్స్ సేఫ్ సైడ్ లో బిజినెస్ ను చేశారని చెప్పాలి. ఇక భోలా శంకర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో అన్నది ఆసక్తిగా మారిందని చెప్పాలి ఇప్పుడు. సినిమా టాక్ వస్తే ఈ మొత్తం రికవరీ అవ్వడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు.