బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన రీసెంట్ మూవీస్ లో వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవడమే కాదు మెగాస్టార్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది…
అలాంటి హిట్ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న కొత్త సినిమా భోలా శంకర్(Bhola Shankar) రీమేక్ అయినా కూడా ఒరిజినల్ వర్షన్ తెలుగు లో రిలీజ్ అవ్వకపోవడం, తమిళ్ వర్షన్ కూడా కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉండటంతో…
భోలా శంకర్ కి ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మరి సినిమా ఈ అడ్వాంటేజ్ ను ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి. ఇదే టైంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్…
చాలా ముఖ్యం అని చెప్పాలి. మెగాస్టార్ రీసెంట్ మూవీస్ లో గాడ్ ఫాదర్ మూవీ లోవేస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. తర్వత వచ్చిన వాల్తేరు వీరయ్య మాత్రం తిరిగి జోరు చూపించింది. సినిమా ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే గాడ్ ఫాదర్ కన్నా బెటర్ గా ఓపెన్ అయ్యే అవకాశం ఉండగా…
వాల్తేరు వీరయ్యని అందుకుంటుందో లేదో చూడాలి. గాడ్ ఫాదర్ 12.97 కోట్ల షేర్ తో ఓపెన్ అవ్వగా వాల్తేరు వీరయ్య 22.90 కోట్లతో ఓపెన్ అయింది. ఇక ఇప్పుడు భోలా శంకర్ ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే 15-16 కోట్ల రేంజ్ లో ఓపెన్ అవ్వొచ్చు అనిపిస్తుంది…
కానీ సినిమాకి టాక్ బాగుండి షో షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయితే 18 కోట్ల రేంజ్ అందుకునే చాన్స్ ఉందని చెప్పాలి. సినిమా మినిమం రెస్పెక్టబుల్ ఓపెనింగ్స్ ను అందుకోవాలి అంటే 20 కోట్ల రేంజ్ షేర్ ఓపెనింగ్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుందో చూడాలి.