బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bhola Shankar) సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా సినిమా మీద ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించేలా అంచనాలు ఉన్నాయి కానీ…
అవి ఓ భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో తర్వాత నుండి వస్తున్న సినిమా రేంజ్ బజ్ కి తగ్గట్లు అయితే లేదనే చెప్పాలి ఇప్పుడు…. ఇదంతా ఆల్ మోస్ట్ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా ముందుకు ఉన్న పరిస్థితులను గుర్తు చేసేలా ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు.
వాల్తేరు వీరయ్య రిలీజ్ కి ముందు కూడా బజ్ అండ్ బుకింగ్స్ కొంచం అటూ ఇటూగా భోలా శంకర్ మాదిరిగానే ఉండగా ఆ సినిమాకి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అలాగే ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వడంతో అద్బుతమైన లాంగ్ రన్ ని సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు భోలా శంకర్ సినిమా కి కూడా ఇలాంటి సీన్ రిపీట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ప్రజెంట్ పోటిలో ఉన్న రజినీకాంత్(Rajinikanth) జైలర్ మూవీ(Jailer Movie) తో పోల్చితే భోలా శంకర్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి….
కానీ ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే సంక్రాంతి రేంజ్ లో కాకపోయినా ఇండిపెండెన్స్ వీకెండ్ లో మెగాస్టార్ తిరిగి రాంపేజ్ చూపించే అవకాశం ఎంతైనా ఉంది. మరి వాల్తేరు వీరయ్య సీన్ రిపీట్ అవుతుందో లేదో కొన్ని రోజుల్లో తేలబోతుంది…